రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఏపీ రాజకీయాలు మరియు మొన్న ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి అధిష్టానానికి వివరంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకా లోలోపల ఏ విషయాల పైన చర్చలు జరిగాయన్న విషయం గోప్యంగానే ఉంది. తాజాగా పవన్ ఢిల్లీ టూర్ పై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఢిల్లీకి వెళ్ళింది కేవలం చంద్రబాబు అజెండా కోసమే అంటూ స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన టీడీపీలు పొత్తులు పెట్టుకుని మాపై పోటీ చేయడానికి ప్రస్తుతం అడ్డుగా ఉన్న బీజేపీని బదులుకోమని ఫైనల్ సెటిల్మెంట్ కు చంద్రబాబు వెళ్ళమన్నాడని అంబటి వివరించారు. పవన్ వలన అధికారంలోకి వస్తాడా రాడా అన్నది పక్కన పెడితే కాపుల ఓట్లను చీల్చడమే బాబొరి ప్రధమ కర్తవ్యంగా మారిందని ఆయన కామెంట్స్ చేశారు.