వాస్తు: గర్భిణీలు ఉన్న ఇంట్లో వీటిని ఉంచండి.. సమస్యలు ఉండవు సంతోషమే..!

-

వాస్తు ప్రకారం ఫాలో అయితే చాలా సమస్యల నుండి మనం దూరంగా వచ్చేయొచ్చు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా పండితులు చెప్పినట్లు ఆచరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే బాధల నుండి బయటపడవచ్చు. వేసవికాలంలో గర్భిణీలు వారి యొక్క ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. అలానే గర్భిణీలు సమస్యలు ఏమి లేకుండా సంతోషంగా ఉండాలంటే ఈ చిట్కాలని తప్పక పాటించండి. ఎందుకంటే వీటిని అనుసరించడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. మీ భార్య కనుక గర్భిణీ అయితే కచ్చితంగా వీటిని మీ ఇంటికి తీసుకువెళ్లండి. వీటి వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇబ్బందుల నుండి గట్టెక్కేయచ్చు.

గర్భిణీ కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే బాలకృష్ణుడు ఫోటోని ఆమె గదిలో పెట్టండి దీని వలన మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పైగా పుట్టే పిల్లవాడిని ఇది ప్రభావితం చేస్తుంది. అలానే గర్భిణీలు ఉన్నచోట నెమలీకని ఉంచితే కూడా చాలా మంచిది ఉదయం లేచిన తర్వాత దానిని చూస్తే ఎంతో మంచి కలుగుతుంది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గా ఉండడానికి ఇది సహాయపడుతుంది. అలానే మంచి బిడ్డ పుడతాడు. నవ్వుతూ ఉండే చిన్నపిల్లల ఫోటోలని కూడా గర్భిణీలు వారి గదిలో పెట్టుకుంటే చాలా మంచిది ప్రశాంతతని ఇస్తుంది. పైగా పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఇస్తుంది.

ఆనందంగా ఉంచుతుంది. రాగితో ఉండే వస్తువులను ఏదో ఒకటి గదిలో ఉంచుకోండి. వాస్తు శాస్త్రం ప్రకారం రాగి నెగిటివ్ ఎనెర్జీని తొలగిస్తుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఇస్తుంది కాబట్టి దీనిని కూడా మీరు మీ గదిలో ఉంచుకోండి. అలానే గర్భిణీలు వాళ్ళ గదిలో పసుపుతో కలిపిన బియ్యాన్ని కొంచెం గదిలో ఉంచుకోండి ఇది కూడా వారి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలని మరి ఇలా అనుసరించి ఆనందంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news