వాస్తు: ఆఫీస్ లో ఎంత కష్టపడుతున్నా ఫలితం లేదా..? అయితే ఈ దిశ లో కూర్చుని చూడండి..!

-

జీవితం లో పైకి రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అనుకున్నంత మాత్రాన లైఫ్ లో పైకి వచ్చేలేము. దానికి తగ్గ కృషి చేయాలి. కష్ట పడుతూ ప్రయత్నం చేస్తూ వెళితే లైఫ్ లో సక్సెస్ ని అందుకోగలము. మీరు కూడా మీ జీవితం లో పైకి రావాలని అనుకుంటున్నారా…? ఆశించిన స్థాయి లో ఫలితం దక్కడం లేదా…? అయితే కచ్చితంగా పండితులు చెప్తున్న అద్భుతమైన వాస్తు చిట్కాలని అనుసరించాలి. వీటిని కనుక మీరు అనుసరించారంటే కచ్చితంగా అనుకున్నంతగా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కుతుంది.

చాలా మంది ఆఫీసు లో ఎంత కాలం కష్టపడుతూ ఉంటారు. వాళ్ల కోసం ఆలోచించకుండా ఎంత ఎఫర్ట్ పెట్టగలిగితే అంతలా కష్టపడుతూ ఉంటారు. అయినా కూడా ప్రమోషన్ రాకనో లేదంటే గుర్తింపు రాకనో సతమతమవుతుంటారు. అందుకోసం మీరు పండితులు చెప్పినట్లు చేయండి.

దక్షిణ దిశలో కానీ పడమర దిశ లో కానీ మీ రూమ్ ఉండేటట్టు చూసుకోండి. ఇలా కనుక ఉంటే కచ్చితంగా అనుకున్నది సాధించొచ్చు. గది లోపల మీరు తూర్పు వైపు కానీ ఉత్తరం వైపుకి కానీ కూర్చోండి. ఇది మీకు మంచి ఫలితాన్ని తీసుకువస్తుంది. ఇలా కూర్చుని పని చేయడం వలన త్వరగా మీకు గుర్తింపు వస్తుంది.

ఒకవేళ కనుక మీరు షాప్ ని నడుపుతుంటే మీ షాపు లో సామాన్లు దక్షిణ వైపు కానీ పడమర వైపుకు కానీ ఉంచుకోండి. ఇది మీకు చక్కటి ఫలితాలను తీసుకొస్తుంది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలని వీటిని అనుసరించి ఆనందంగా ఉండండి అలానే అనుకున్నంత ఎత్తు ఎదగండి అక్కడే ఉండి పోవద్దు.

Read more RELATED
Recommended to you

Latest news