ఢిల్లీకి మించి తెలంగాణలో భారీ లిక్కర్ స్కాం జరిగింది : బూర నర్సయ్య

-

దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక పెద్ద సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో, మన తెలుగు రాష్ట్రాల్లో.. అటు ఢిల్లీలో కూడా కలకలం రేపింది. అయితే అంతకుమించిన కుంభకోణం తెలంగాణలో జరిగిందని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి మించి తెలంగాణలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని తెలిపారు. త్వరలో ఆధారాలతో సహా బయట పెడతామని అన్నారు ఆయన.

 

ఫారిన్ లిక్కర్ సేల్స్‌ ద్వారా తెలంగాణలో ఒక వ్యక్తికి వందల కోట్ల లబ్థి చేకూరుతోందని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ‘‘ఫారిన్ లిక్కర్ పాలసీకి ఐదేళ్ల కాలపరిమితి ఇవ్వటానికి కారణమేంటో తేల్చాలి. ఫారిన్ లిక్కర్ టెండర్‌కు 24 గంటలే సమయం ఇవ్వటానికి కారణమేంటి? టెండర్‌లో కేవలం ఒక్క అప్లికేషన్ మాత్రమే ఎందుకొచ్చింది?’’ అని అడిగారు ఆయన.
హైదరాబాద్‌లో ఒక వైన్స్‌లో రోజుకు కోటి రూపాయలు సేల్స్ జరుగుతున్నాయని అన్నారు నర్సయ్య . ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మొత్తం ఒక ప్రైవేట్ వ్యక్తికి వెళ్తోందని తెలిపారు నర్సయ్య. షాపు పేరు, వ్యక్తి పేరు త్వరలో బయటపెడతామని నర్సయ్య పేర్కొన్నారు. రాజకీయ పార్టీల్లో వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు సహజమన్నారు. కాని కాంగ్రెస్ కల్చర్‌ను బీజేపీ దిగుమతి చేసుకుందనేది ప్రచారం మాత్రమే అని తెలిపారు. బండి సంజయ్ వ్యక్తి కాదు..అయన ఒక వ్యవస్థ‌ అని, వ్యక్తి కంటే వ్యవస్థలకే ప్రాధాన్యత ఎక్కువ ఉంటోందని బూర నర్సయ్య గౌడ్ వ్యక్తపరిచారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news