వీరసింహారెడ్డి మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

-

బాలకృష్ణ, శ్రుతి హాసన్ జంటగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి పండుగ కానుకగా థియేటర్ లోకి రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మూవీ టీమ్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. అదేంటంటే.. వీరసింహారెడ్డి సినిమా ట్రైలర్ ను రేపు రాత్రి 8.17 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు, పోస్టర్లు చూస్తుంటే మాస్‌, యాక్షన్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని అనిపిస్తుంది. ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్‌ కూడా ఎక్కువగా ఉంటుందనే అంటున్నారు. బాలకృష్ణ గతంలో నటించిన సూపర్‌ హిట్‌ సినిమాలు ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’లో లాగానే ఈ ‘వీరసింహారెడ్డి’లో కూడా హృదయానికి హత్తుకునే కుటుంబ సన్నివేశాలు ఉండనున్నాయట. వరలక్ష్మి శరత్‌కుమార్‌, బాలకృష్ణకు మధ్య జరిగే సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసి కంటతడి పెట్టించేలా ఉంటాయంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news