టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, వాసుపల్లి గణేష్ కుమార్‌లు గురువారం ఉదయం పట్టణంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించవ్దదంటూ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పోలీసులతో దౌర్జన్యానికి దిగారు.
ర్యాలీకి అనుమతులేందుకంటూ పోలీసులపై దాడి చేశారు. జంక్షన్ వద్ద ఉన్న బారికేడ్స్‌ను తోసేసి ర్యాలీగా వెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాల చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అయితే ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులకు గురయ్యేలా చేశారు.