Breaking : వేములవాడ రాజన్న భక్తులకు అలర్ట్‌.. ధర్మగుండం సిద్ధం

-

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి భక్తులకు శుభవార్త. భక్తుల పుణ్యస్నానాలకు వేములవాడ ఆలయ ధర్మగుండం సిద్ధమైంది. కరోనా వలన 19 ఫిబ్రవరి 2020 లో ధర్మగుండంలో భక్తుల స్నానాలను అధికారులు నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఇప్పుడు పుణ్యస్నానాలకు అనుమతిచ్చారు. ఆలయ, వేములవాడ మున్సిపల్‌ అధికారులు పూడికతీత పనులు చేపట్టారు. పుష్కరిణి చుట్టూ గల గోపురాలను, మెట్లను శుభ్రం చేశారు. మిషన్‌ భగీరథ నుంచి వచ్చిన నీటితో గుండాన్ని నింపారు.

ఈ రోజు ఉదయం 8 గంటలకు ధర్మగుండంలో గణపతిపూజ, కరోనా నివారణ సంప్రోక్షణ పూజల అనంతరం భక్తుల పుణ్యస్నానాలకు అనుమతించారు. ఇక ఈసారి కార్తీక మాసంలో వేములవాడ ఆలయానికి కాసుల వర్షం కురిసింది. నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని వివిధ రూపాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని హుండీ ద్వారా రూ. 8 కోట్ల 25 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

 

ఇక ఈసారి కార్తీక మాసంలో వేములవాడ ఆలయానికి కాసుల వర్షం కురిసింది. నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని వివిధ రూపాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని హుండీ ద్వారా రూ. 8 కోట్ల 25 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news