ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసన మండలి రద్దు బిల్లుకు ఆమోదం ఇటీవల తెలపడం జరిగింది. దీంతో ఈ బిల్లు పార్లమెంటుకు పంపింది జగన్ సర్కార్. ఇటువంటి అత్యంత క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ రాజకీయ నేతలంతా వెంకయ్య నాయుడుపై ఆయన ఈ బిల్లు విషయంలో వ్యవహరించే తీరుపై ఆసక్తిగా గమనిస్తున్నారు.
దీంతో శాసన మండలి రద్దు విషయంలో వెంకయ్యనాయుడు జగన్ కి అనుకూలంగా వ్యవహరిస్తారో లేకపోతే వ్యతిరేకంగా వ్యవహరిస్తారో అన్న టెన్షన్ వైసీపీ పార్టీలో నెలకొంది. వాస్తవానికి అయితే చంద్రబాబు కి చాలా అత్యంతంగా సన్నిహితంగా ఉండే నాయకుడు వెంకయ్య నాయుడు అని ఏపీ రాజకీయాల్లో పేరు ఉంది. అయితే తాజా పరిస్థితుల్లో శాసన మండలి రద్దు విషయంలో బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత మాత్రమే రాజ్యసభలోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
అయితే ఇదంతా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరుగుతుంది. దీంతో అమిత్ షా ఓకే అంటే శాసనమండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రద్దు అయినట్లే. ఇటువంటి నేపథ్యంలో ఈ తతంగం మొత్తం ముందే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియజేసిన తర్వాత మాత్రమే జగన్.. రాష్ట్రంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లు…వెంకయ్యనాయుడు రంగంలోకి దిగిన జగన్ కి పెద్దగా డామేజ్ అయ్యే అవకాశం ఏమీ లేదు అని బిజెపి మరియు వైసిపి పార్టీలు కలసి సంయుక్తంగా శాసన మండలి రద్దు విషయంలో నడుచుకుంటున్నారని జాతీయ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి.