టాలీవుడ్లో దగ్గుబాటి ఫ్యామిలీది మొదటి నుంచి కీలకంగా ఉంటున్న కుటుంబం. ఆ కుటుంబం నుంచి విక్టరీ వెంకటేశ్ venkatesh హీరోగా ఉంటే… ఆయన అన్న సురేశ్‌బాబు ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి ఇప్పుడు చేసిన సినిమా నారప్ప. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయి రిలీజ్ డేట్ కూడా అప్పట్లో అనౌన్స్ చేసింది. కానీ కరోనాతో వాయిదా పడింది.
దీంతె నారప్ప మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఒప్పందం కూడా చేసుకున్నారంట. కానీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు మాత్రం అందుకు ఒప్పుకోవట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ లలోనే విడుదల చేయాలని పట్టుబట్టడంతో ఆయన కూడా ఇప్పుడు కరోనా తగ్గాక థియేటర్లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.
కానీ మూవీ సమర్పకుడు థాను ఇందుకు అంగీకరించట్లేదు. ప్రస్తుత కరోనా పరిస్థతుల్లో ఓటీటీలో అయితేనే బెస్ట్ అని అందులోనే విడుదల చేయాలని ప్రొడ్యూసర్ సురేష్ బాబు మీద ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో హీరో వెంకటేశ్ రంగంలోకి దిగి థానుకు సర్ధి చెప్పే ప్రయత్నంలో భాగంగా నష్టాలు వస్తే తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఒప్పించాడంట. ఇప్పుడు ఇదే వార్త హల్ చల్ చేస్తోంది.