Venkatesh: నమ్మిన వాళ్లను మోసం చేయడం దారుణం.. వెంకీమామ‌ పోస్టు వైర‌ల్

-

Venkatesh: టాలీవుడ్ లో వివాదాలకు దూరంగా ఉండే హీరో ఎవ‌రైనా ఉన్నారంటే.. అది విక్ట‌రీ వెంకటేష్ ఒక్కడే. ఆయ‌న చాలా సింపుల్ గా ఉంటాడు. త‌న ప‌నెంటో తాను చేసుకుని వెళ్లిపోతాడు. వీలైనంత వ‌ర‌కూ కాంట్రవర్సీ చాలా దూరంగా ఉంటాడ‌న‌డంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎదోక పోస్టు పెడుతున్నారు. ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. అవి నాగ చైతన్య, సమంత విడిపోయిన తర్వాత.. అలాంటి పోస్టులు పెట్టడం మరింత ఆసక్తిక‌రంగా మారాయి. అవన్నీ ఇప్పుడు వైరల్ గా మారాయి. తాజాగా వెంకీ మామ మ‌రో పోస్ట్ కూడా నెట్టింట్టో వైరల్ గా మారింది.

నిన్ను ఇష్ట‌ప‌డేవాళ్ల‌ను దూరం చేసుకోకు.. నువ్వే కావాల‌నుకుంటున్న వాళ్లను దూరం పెట్ట‌కు.
ఎవ‌రైతే నిన్ను ఎక్కువ‌గా న‌మ్ముతారో..వాళ్ల‌ను మోసం చేయాల‌ని అనుకోకు. గుర్తు పెట్టుకునే వాళ్ల‌ను అస్స‌లు మ‌ర‌చిపోకు అంటూ వెంకీమామ‌ త‌న పోస్ట్‌లో తెలిపాడు. ఇది చైతూ, సమంతను ఉద్దేశించి పెట్టాడా లేదంటే యాదృశ్చికంగానే అలా పోస్ట్ చేసాడా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకు సామ్ చైతూల వ్య‌వ‌హ‌రంలో నోరు మెదపని వెంకీ మామ పరోక్షంగా వారిని కోట్స్ ద్వారా హితబోధ చేస్తున్నాడా అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. వారి విడాకులు అయినప్పటినుంచి అయన పెట్టే కొటేషన్స్ అన్ని ప్రేమ, బంధం, విరహం మీదే ఉండడం ప‌లు అనుమానాలకు దారి తీస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news