ఒక ప్రెస్ మీట్ పెడితే చిన్న సినిమా అయితే మినమం 50 వేలు, పెద్ద సినిమా కైతే లక్ష రూపాయలు మినిమంగా కవర్లేకే ఖర్చు అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యే లోపు ప్రచారానికి అన్ని రకాలు గా కలిపి కోటి రూపాయలు పెట్టాల్సి వస్తోంది. ఆ కవర్ లేకపోతే కవరేజ్ ఉండదన్న భయంతో ఇన్నాళ్లు వచ్చిన పాత్రికేయులకు ఇవ్వక తప్పలేదు. ఆ విషయంలో టాలీవుడ్ కోలీవుడ్ ని మించిపోయిందని కొందరు అంటున్నారు.
కోలీవుడ్ ఇండస్ర్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రెస్ మీట్ కు వస్తే కవర్లో ఎంతో కొంత డబ్బు పెట్టి పంచే పద్దతికి స్వస్తి పలికింది. అలాగే భోజనాలు, స్నాక్స్ లాంటివి కూడా ప్రోవైడ్ చేయకూడదని డిసైడ్ అయింది. కేవలం ప్రెస్ మీట్ కు వచ్చిన పాత్రికేయులకు టీ ఇస్తే చాలు..సమోసా కూడా పెట్టకూడదంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో కొంత మంది జర్నలిస్టులు, పీఆర్ ఓలు కవర్లు కోసమే వస్తున్నామా? మీరు పెట్టే భోజనాల కోసమే వస్తున్నామా?అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరేమనుకున్నా పర్వాలేదు మేము మాత్రం రూల్స్ మార్చం అంటూ స్ర్టిక్ట్ గా వ్వవహరించింది. అయితే ఇప్పుడీ పద్దతిని టాలీవుడ్ లో కూడా ఎంత వేగంగా తీసుకొస్తే అంత మంచిదని కొంత మంది నిర్మాతలు భావిస్తున్నారుట.
ఒక ప్రెస్ మీట్ పెడితే చిన్న సినిమా అయితే మినమం 50 వేలు, పెద్ద సినిమా కైతే లక్ష రూపాయలు మినిమంగా కవర్లేకే ఖర్చు అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యే లోపు ప్రచారానికి అన్ని రకాలు గా కలిపి కోటి రూపాయలు పెట్టాల్సి వస్తోంది. ఆ కవర్ లేకపోతే కవరేజ్ ఉండదన్న భయంతో ఇన్నాళ్లు వచ్చిన పాత్రికేయులకు ఇవ్వక తప్పలేదు. ఆ విషయంలో టాలీవుడ్ కోలీవుడ్ ని మించిపోయిందని కొందరు అంటున్నారు. అదీ ఇటీవల కాలంలో కవర్లు కోసం ఫైటింగ్ లు కూడా చేయడం మొదలు పెట్టారని ఈ సందర్భంగా వెలుగు లోకి వచ్చింది. జర్నలిస్టులు, మీడియా పేర్లు చెప్పుకుని కొంత మంది పీఆర్ఓ లు కోట్ల రూపాయాలు సంపాదించారని ఈ సందర్భంగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇద్దరు జంట పీఆర్ ఓలు నిర్మాతల్ని, మీడియాని అడ్డంగా మోసం చేసి కోట్ల రూపాయలు సంపాదించరని ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది.
ఇక చాలా సినిమాలకు రివ్యూలు రూపంలో దబాయించి డబ్బులు కూడా వసులు చేస్తున్నారని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పేరున్న ఓ నాలుగు పత్రికలు యథేశ్చగా ఈ దోపిడికి పాల్పడుతుందని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇవ్వకపోతే రేటింగ్ లు సరిగ్గా ఇవ్వమని..టీవీ ఛానెల్స్ రివ్యూ పాయింట్ లో మీ సినిమా సంగతేంటో చూస్తామని హెచ్చరిస్తున్నారన్న మాట వెలుగులోకి వచ్చింది. డబ్బులు తీసుకుని కూడా నీతి, నిజాయితీ లేకుండా మోసానికి పాల్పడుతున్నారని వాపోతున్నారు. ఆ మధ్య లంక అనే సినిమా విషయంలో ఓ పీఆర్ ఓ ఇలాగే మోసం చేసాడుట. లక్ష రూపాయలు తీసుకుని పని చేయకుండా పత్తా లేకుండా పోయాడని, ఫోన్ చేస్తే ప్లైట్ లో మోడ్ లో పెట్టాడని ఆరోపించారు. ఈ బాధలన్నింటిని నుంచి విముక్తి దొరకాలంటే టాలీవుడ్ లో కూడా కవర్ల కల్చర్ ఎత్తేస్తే బాగుంటుందని అంటున్నారు. ఈ విషయాన్ని ఫిలిం ఛాంబర్లో నిర్మాతల సంఘం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత తర్వాగా చరమ గీతం పాడాలని చూస్తున్నారుట.