చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు.
ఇక తాజాగా కోలీవుడ్ ప్రముఖ నటుడు పూ రాము నిన్న అర్ధరాత్రి మరణించారు. నిన్న గుండెపోటుతో ఆసుపత్రిలో జాయిన్ అయిన రాము సాయంత్రం తుదిశ్వాస విడిచారు. రాము మరణం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు అలాగే కోలీవుడ్ సెలబ్రిటీలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కాగా రాము.. ఆకాశం నీ హద్దురా అనే సినిమాలో… హీరో సూర్యకు తండ్రి పాత్రలో కనిపించారు. అప్పటినుంచి రాము.. తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు.