ఖమ్మం కాంగ్రెస్ సభలో వీహెచ్ సంచలన వ్యాఖ్యలు…!

ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన రైతు పోలీకేక సభలో వి హెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి బడుగు బలహీన వర్గాలు వారికే ఇవ్వాలని వి హెచ్ అనటంతో సభలో కొందరు కాంగ్రెస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రేవంత్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. అయినా లెక్కచేయని విహెచ్ ఘాటుగా స్పందిస్తూ బడుగు బలహీన వర్గాలకు అధ్యక్ష పదవి ఇస్తేనే పార్టీ రాష్ట్రంలో బతికి బట్టకడుతుందని…ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వకుండా పార్టీని నమ్ముకున్నోళ్లకే ప్రాధాన్యమివ్వాలన్నారు.

ఇదే సభలో రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.కేటిఆర్, కేసీఆర్ ఎంగిలి మెతుకుల కు ఆశపడి కాంగ్రెస్ ను వీడి కొందరు టిఆర్ఎస్ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో పది కి పది అసెంబ్లీ స్థానాలు గెలుస్తామన్నారు. మిర్చి రైతుల గిట్టుబాటు కోసం రైతులు పోరాడితే అరెస్ట్ చేసి రైతుల చేతులకు బేడీలు వేసి బందీపోటు దొంగలా చేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్షించాడు. దేశం, రాష్ర్టంలో రైతు వెన్నుముక విరిచేందుకే వ్యవసాయ బిల్లులు అని రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందిఎవరు ఆత్మహాత్యలు చేసుకోవద్దన్నారు.