శ్రీలక్ష్మి పూజ ఎప్పుడు ఎలా చేయాలి ?

ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రోజున దీపావళి ముహూర్త సమయంలో శ్రీలక్ష్మీదేవి పూజ చేయాలి. .
పండుగ ఇలా చేసుకోవాలి.. తెల్లవారుజామున మంగళ స్నానాన్ని ఆచరించిన తరువాత దేవుణ్ణి పూజిస్తారు. మధ్యాహ్నం సమయంలో పితృదేవతలకు శ్రాద్ధము మరియు బ్రాహ్మణులకు భోజనం పెడతారు, సాయంత్రము తమ పూజ స్థలాన్ని లతలు, పుష్పాలు మరియు ఆకులతో అలంకరించి లక్ష్మీదేవి, శ్రీ విష్ణు మరియు కుబేరున్ని పూజిస్తారు. ఇలా లక్ష్మీపూజ రోజున ఈ విధిని ఆచరించబడుతుంది. లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఆసనాన్ని సిద్ధం చేయాలి. దానిపైన అష్టదళ పద్మం గాని లేదా స్వస్తిక చిహ్నాన్ని గాని అక్షింతలతో తయారు చేసి దానిపై లక్ష్మీదేవి విగ్రహమును స్థాపించాలి. కొన్ని ప్రాంతాల్లో కలశముపై పూజ పళ్ళెమును ఏర్పాటుచేసి తరువాత లక్ష్మీదేవి విగ్రహమును స్థాపన చేస్తారు.

లక్ష్మీదేవి ప్రక్కనే కుబేరుడి ప్రతిమను ఏర్పాటు చేయాలి. తరువాత లక్ష్మీ దేవితో పాటు దేవతలందరికీ చక్కెర వేసిన ఆవుపాలుతో తయార చేసిన పదార్థమును నైవేద్యంగా పెడతారు. ధనియాలు, బెల్లం, పొట్టుతో వున్న పేలాలు, చక్కెర బిల్లలు మొదలగు పదార్థములను లక్ష్మీదేవికి సమర్పించి ఆ తరువాత వాటిని ప్రసాదంగా బంధువులకు పంచుతారు. ఎండిన గోంగూర పుల్లలకు వొత్తులు చుట్టి వెలిగించి దక్షిణం వైపు చూపించి పితృదేవతలను ప్రార్థ్ధిస్తారు. బ్రాహ్మణులకు మరియు ఆకలితో వున్నవారికి అన్నదానం చేస్తారు. ఈ రోజు రాత్రికి నిద్రపోకుండా జాగరణ చేస్తారు. ఎందుకంటే ఆశ్వయ్యుజ అమావాస్య రోజు రాత్రిపూట లక్ష్మీదేవి ఆదర్శవంతమైన గృహం కోసం వెదుకుతూ తిరుగుతు వుంటుంది. ఎక్కడైతే చారిత్రవంతులు, కర్తవ్యదక్షులు, ఓపిక గలవారు, ధర్మనిష్ఠ గలవారు, భగవత్భక్తి మరియు క్షమాశీలులైన పురుషులు మరియు గుణవంతులైన, పతివ్రతా స్త్రీలు నివసించే గృహంలో మాత్రమే లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడుతుంది.

శ్రీ