జగన్ హక్కులను ప్రశ్నిస్తోన్న బాబు… ఇంక మారరా?

-

తాజాగా మరోసారి జూం లోకి వచ్చి కాసేపు గొంతు నొప్పి పుట్టించుకునే పనికి పూనుకున్నారు చంద్రబాబు. పాడిందే పాడరా పాసిపల్ల దాసరా అన్నట్లుగా అమరావతి విషయంలో చెప్పిందే చెబుతున్నారు. మార్గమధ్యలో అసత్యాలను అత్యంత సులువుగా, తన అసమర్ధతను అత్యంత సునాయాసంగా వళ్లివేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ముఖ్యమంత్రి అన్న విషయం మరిచారో లేక ఇంకా తానే ముఖ్యమంత్రిని అన్న భావనలో ఉన్నారో తెలియదు కానీ… జగన్ ని ఉద్దేశించి అమరావతి విషయంలో నిర్ణయాలు తీసుకొవడానికి “మీరెవరు” అని ప్రశ్నిస్తున్నారు!

40 ఏళ్ల కెరీర్ లో చంద్రబాబు ఎన్నడూ చూడని విక్టరీ జగన్ సంపాదించారు. ఆ స్థాయిలో జనం జగన్ ని నమ్మారని అనాలో… ఆ స్థాయిలో చంద్రబాబుపై వ్యతిరేకత వ్యక్తపరిచారని భావించాలో తెలియదు కానీ… 2019 బాబు తిరోగమనానికి పునాది అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ క్రమంలో… అమరావతి భవనాలు అమ్మటానికి మీరెవరు? అమరావతి విషయంలో నిర్ణయాలు తీసుకొవడానికి మీరెవరు? అన్నస్థాయిలో జగన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు చంద్రబాబు!

అమరావతి చంద్రబాబుదా… అమరావతి రైతులు చంద్రబాబుని నమ్మి రాజధానికి భూములు ఇచ్చారా? అమరావతి రెస్పాన్సిబిలిటీ చంద్రబాబుదా? అదే నిజమైతే… రైతుల తరుపున బాబు చేస్తున్న పోరాటం ఏది! నిజంగా భూములిచ్చిన రైతుల భవిష్యత్తుపైనా, బ్రతుకుపైనా బాబుకు అంత శ్రద్ధ ఉంటే… అమారావతి విషయంలో గ్రాఫిక్స్ కోసం అంత సమయం ఎందుకు వృథా చేస్తారు? అమరావతిని కాస్తా భ్రమరావతిగా మార్చారనే విమర్శలు ఎందుకు మూటగట్టుకుంటారు? 2019లో జనాల తిరస్కారాన్ని అంతలా ఎందుకు పొందుతారు?

ఒకవేల అమరావతి బాధ్యత ప్రభుత్వానిదే అయితే… బాబు ప్రశ్నిస్తున్న ప్రశ్నలకు విలువేది? అలా ప్రశ్నించే హక్కు చంద్రబాబుకు ఎక్కడుంది? ప్రభుత్వం చేస్తోన్న పనులు నచ్చని పక్షంలో… సూచనలు చేయాలి, విమర్శలు గుప్పించాలి. అంతే కానీ… అత్యధిక ప్రజల మెజారిటీతో, బాబు తన జీవితంలో కనీ వినీ ఎరుగని మెజారిటీతో, ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని “నీవెవరు.. నీకేమి హక్కుంది” అన్నస్థాయిలో ప్రశ్నించడాన్ని ఎలా చూడాలి? బాబుకే తెలియాలి! భ్రమలను వీడాలి! వాస్తవంలోకి రావాలి! రైతులను ఏమార్చే పనులు మానుకోవాలి! తన హయాంలో ఎన్నో ఇబ్బందులు పడిన రైతులను ఇకపై అయినా ప్రశాంతంగా ఉంచేలా చూడాలి! అని పలువురు సూచిస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news