విజయ్ ఆంటోని “హత్య” ట్రైలర్ రిలీజ్

-

” బిచ్చగాడు” సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరుని సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోని. ఈ చిత్రం తరువాత ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతూ వస్తుంది. తాజాగా బాలాజీ కే కుమార్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ నటించిన తమిళ చిత్రం” కోలాయ్”. ఈ చిత్రాన్ని తెలుగులో ” హత్య” పేరుతో విడుదల చేస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు.

రితికా సింగ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు. లైలా అనే ఇండియన్ సెలబ్రిటీ మోడల్ హత్యకు గురవుతుంది. ఈ హత్యను విజయ్ ఆంటోని ఎలా చేదించాడనేది ఈ సినిమా కథ. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఈ సినిమాకి కమల్ బోరా, జి ధనంజయ్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరై, సింగం పిల్లై, సిద్ధార్థ శంకర్, ఆర్విఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దశకత్వంవం వహిస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ని నాచురల్ స్టార్ నాని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news