సినీ నటుడు విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా (16) ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నెలోని నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటనతో ఆయన కుటుంబం గత రెండు రోజులుగా శోకసంద్రంలోనే ఉంది. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ ఎక్స్ (ట్విటర్ వేదికగా తాజాగా స్పందించారు. అందులో ఆయన ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన కుమార్తెతో పాటు తాను కూడా చనిపోయానని ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. అపురూపంగా పెంచుకున్న కూతురు విగతజీవిగా పడిఉండడంతో తల్లిదండ్రులైన విజయ్, ఫాతిమా గుండెలు పగిలేలా ఏడ్చారు.
వారి పరిస్థితి చూసి ప్రతి ఒక్కరు కంటనీరు పెట్టుకున్నారు. ఇక కూతురు మృతి చెందిన దగ్గరనుంచి ఇప్పటివరకు కూడా విజయ్.. మాట్లాడింది లేదు. ఆయన మీరా మారణాన్ని తట్టుకోలేకపోతున్నట్లు తెలుస్తుంది. దాదాపు మూడు రోజుల తరువాత విజయ్ ఆంటోని మొదటిసారి మీరా మరణంపై స్పందించాడు. ట్విట్టర్ ద్వారా తన బాధను తెలియజేశాడు.“ప్రియమైన స్నేహతులారా,నా కూతురు మీరా చాలా ప్రేమగా, ధైర్యంగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం మరియు ద్వేషం ఈ ప్రపంచం కంటే మెరుగైన ప్రశాంతమైన ప్రదేశానికి ఆమె ఇప్పుడు వెళ్ళింది.ఆమె నాతో మాట్లాడుతోంది. నేను ఆమెతో పాటే చనిపోయాను. నేను ఇప్పుడు ఆమె కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను. ఇప్పటినుంచి ఏది చేసినా ఆమె కోసమే చేస్తాను.. ఇకనుంచి నేను చేయబోయే మంచి పనులన్నీ ఆమె పేరు మీదనే ప్రారంభిస్తాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్వీట్ పై అభిమానులు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మంచి నిర్ణయం తీసుకున్నారు అని కొందరు.. మీకు దైర్యం, సహనం ఇవ్వాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.