గణేష్‌ నిమజ్జనం కోసం GHMC కీలక నిర్ణయం..

-

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ ఏడాది గణేష్‌ నిమజ్జనం కోసం వినూత్న రీతిలో ఆలోచించింది. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకుంది జీహెచ్‌ఎంసీ.. నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వేలాది గణనాధులు కొలువుదీరారు. ప్రతి ఇంట్లో గణేషుడు పూజలందు కుంటున్నారు. అయితే గణేష్ నిమజ్జనం మూడో రోజు నుంచే ప్రారంభం అయిన సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA), హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) సహా వివిధ శాఖల సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లు చేశారు.

GHMC Arranges 72 Portable Baby Ponds for Hassle-Free Ganesh Immersion

ఈసారి గణేష్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది జీహెచ్ఎంసీ. పర్యావరణ హిత ఉత్సవాల్లో భాగంగా బేబీ పాండ్లతో 72 ప్రదేశాల్లో చిన్నచిన్న కృత్రిమంగా నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు.గణేష్ నిమజ్జనం కోసం సమీపంలోని వాటర్ ట్యాంక్?ప్రజల సౌకర్యార్థం, చెరువుల సంరక్షణ దృష్టిలో ఉంచుకొని గణేష్ నిమజ్జనానికి నగరం అంతటా అనేక ప్రదేశాల్లో ఇమ్మర్షన్ వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు, మల్కం సరస్సు, నల్లగండ్ల సరస్సు, గోపి సరస్సు, కాప్రా చెరువు తదితర సరస్సుల వద్ద కృత్రిమ నీటి ట్యాంకులను రూపొందించారు. గతంలోనూ జీహెచ్‌ఎంసీ ఇలాంటి ట్యాంకులను ఏర్పాటు చేసింది.

 

నిమజ్జనం సమయంలో విగ్రహాలను గౌరవప్రదంగా తొలగించేందుకు మూడు షిఫ్టుల్లో 10వేలమందికి పైగా పారిశుధ్య కార్మికులను నియమించింది GHMC. దీనికి తోడు నీటి వనరుల దగ్గర తగినంత లైటింగ్, బారికేడ్లు, పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలతో అలంకరించబడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news