మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్న రష్మిక, విజయ్‌.. కానీ..

-

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో రష్మిక మందన్న, విజయ్‌ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే.. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గీతగోవిందం నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. అలాంటి వేవి లేవని వారు కూడా ఎలాంటి ప్రకటన లేదు. అయితే.. తాజాగా.. రష్మిక, విజయ్ ప్రస్తుతం మాల్దీవుల్లో విహరిస్తున్నారు. శుక్రవారం వీరు ముంబై విమానాశ్రయంలో ఒకరి తర్వాత ఒకరు 5నిమిషాల వ్యవధిలో కెమెరాల కంటపడడం తెలిసిందే. వీరు మాల్దీవులకు వెళ్లినట్టు అప్పుడు చూచాయిగా తెలిసినా, అక్కడి చిత్రాలను చూస్తుంటే ఇప్పుడు నిజమేనని తెలుస్తోంది. శనివారం రష్మిక తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటోను పోస్ట్ చేసింది.

Image

అందులో ఆమె స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఒంటరిగా కూర్చుని కనిపిస్తోంది. కాకపోతే ఆమె కళ్లజోడును పరిశీలించి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. రష్మిక ధరించిన చలువ కళ్లద్దాలు విజయ్ దేవరకొండవి కావడం గమనించాలి. గతంలో విజయ్ ఇవే కళ్లద్దాలతో కనిపించాడు. ఇద్దరూ కలసి మాల్దీవులకు ఒకేసారి వెళ్లినట్టు కనిపించకుండా 5 నిమిషాల వ్యవధిలో జాగ్రత్తపడ్డారు. మాల్దీవులకు వెళ్లి అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. కానీ, ఈ చిన్న కళ్లద్దాలు వాళ్లిద్దరినీ పట్టించేశాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని రకరకాల ప్రచారాలు వ్యాప్తిలో ఉన్నాయి. వాటిని వీరు ఖండించలేదు. అలాగని ధ్రువీకరించలేదు. మరి నిజమేంటో ఆ నల్ల కళ్లద్దాలకే తెలియాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news