లైగర్ నుంచి బిగ్ అప్డేట్ : దేవరకొండ ఫోటోలు లీక్ !

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “లైగర్”. నిజానికి బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఫైటర్ అనే పేరు ఉంటుందని అందరూ భావించారు. కానీ చివరకు లైగర్ పేరునే ఫైనల్ చేశారు. ఇక లైగర్ అంటే పులికి సింహానికి క్రాస్ బ్రీడు. అంటే మగ సింహానికి ఆడపులికి పుట్టిన బిడ్డను లైగర్ అంటారు.

ఈ సినిమాలో విజయ్‌ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ – ధర్మ క్రియేషన్స్ సంయిక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచానాలే ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి హీరో విజయ్ దేవరకొండ ఫోటో లీక్ అయింది. ఈ సినిమా ఫైటింగ్ సీన్ చేస్తున్న నేపథ్యంలో…. విజయ్ దేవరకొండ పిక్ లీక్ అయింది. షర్టు లేకుండా విజయ్ దేవరకొండ ఫైట్ చేస్తున్నట్లు ఈ ఫోటోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఇక వైరల్ అవుతోంది.