ఉపరాష్ట్రపతి పదవీరీత్యా
A) లోక్‌సభ స్పీకర్
B) రాజ్యసభ చైర్మన్
C) ప్రణాళిక సంఘం చైర్మన్
D) పైవన్నీ
2. భారత రాష్ట్రపతి యొక్క కార్యనిర్వహక అధికారాలలో సరైనది కానది.
A) ప్రధాన మంత్రి తీసుకున్న అన్ని నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియజేస్తూ ఉండాలి
B) రాష్ట్రపతి, మంత్రి మండలి సమావేశాలను కావాలనుకున్నప్పుడు సమావేశపరుస్తాడు
C) ఏదైనా ఒక మంత్రి యొక్క నిర్ణయాన్ని మంత్రి మండలి చేత ఆమోదింపమని కోరవచ్చు
D) భారతదేశ పరిపాలనకు సంబంధించిన ఇతర సమాచారాన్ని అతడు అడిగినప్పుడు తెలియపరుస్తుండాలి
3. భారత రాష్ట్రపతి
A) పార్లమెంట్‌లో భాగం
B) సాంప్రదాయం ప్రకారం రెండు పర్యాయాల కంటే ఎన్నిక కావడానికి అనర్హుడు
C) పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తాడు
D) పైవన్నీ
4. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎవరు తయారు చేస్తారు?
A) రాష్ట్రపతి కార్యదర్శి
B) క్యాబినెట్
C) అటార్నీ జనరల్
D) కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
5. ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి
A) రాజేంద్ర ప్రసాద్
B) రాధాకృష్ణన్
C) సంజీవరెడ్డి
D) వి.వి.గిరి
6. రాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఏ సభలో ప్రవేశపెట్టాలి?
A) రాజ్యసభ
B) లోక్‌సభ
C) ఉభయసభలలో దేనిలోనైనా
D) ఏదీకాదు
7. రాష్ట్రపతి నియంత్రణలో ఏ నిధి ఉంటుంది?
A) భారత సంఘటిత నిధి
B) రాష్ట్రాల సంఘటిత నిధి
c) భారత ఆగంతుక నిధి
d) పబ్లిక్ అకౌంట్
8. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన రాష్ట్రపతి
A) డా రాజేంద్రప్రసాద్
B) సర్వేపల్లి రాధాకృష్ణన్
C) నీలం సంజీవరెడ్డి
D) వి.వి.గిరి
9. భారత ఉప రాష్ట్రపతి ఎవరికి బాధ్యత వహిస్తాడు?
A) రాష్ట్రపతి
B) పార్లమెంట్
C) సుప్రీంకోర్టు
D) పైవేవీకావు
10. భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టారు?
A) లోక్‌సభలో మాత్రమే
B) పార్లమెంట్ ఉభయసభలలో దేనిలోనైనా
C) పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో
D) రాజ్యసభలో మాత్రమే
1.ఉపరాష్ట్రపతి పదవీరీత్యా
జవాబు: B. రాజ్యసభ చైర్మన్
ఉపరాష్ట్రపతి పదవీరీత్యా రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరిస్తారు
2. భారత రాష్ట్రపతి యొక్క కార్యనిర్వహక అధికారాలలో సరైనది కానది.
జవాబు: B. రాష్ట్రపతి, మంత్రి మండలి సమావేశాలను కావాలనుకున్నప్పుడు సమావేశపరుస్తాడు
రాష్ట్రపతి, మంత్రి మండలి సమావేశాలను కావాలనుకున్నప్పుడు సమావేశపర్చలేడు
3. భారత రాష్ట్రపతి
జవాబు: D. పైవన్నీ
భారత రాష్ట్రపతి పార్లమెంట్‌లో భాగం. సాంప్రదాయం ప్రకారం రెండు పర్యాయాల కంటే ఎన్నిక కావడానికి అనర్హుడు. పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తాడు
4. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎవరు తయారు చేస్తారు?
జవాబు: B. క్యాబినెట్
రాష్ట్రపతి ప్రసంగాన్ని కేంద్ర క్యాబినెట్ తయారు చేస్తుంది
5. ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి
జవాబు: C. ఉభయసభలలో దేనిలోనైనా
సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
6. రాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఏ సభలో ప్రవేశపెట్టాలి?
జవాబు: C. ఉభయసభలలో దేనిలోనైనా
ఉభయ సభలలో దేనిలోనైనా రాష్ట్రపతిని తొలగించే తీర్మానం ప్రవేశపెట్టవచ్చు
7. రాష్ట్రపతి నియంత్రణలో ఏ నిధి ఉంటుంది?
జవాబు: A. భారత సంఘటిత నిధి
భారత సంఘటిత నిధి రాష్ట్రపతి నియంత్రణలో ఉంటుంది
8. ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన రాష్ట్రపతి
జవాబు: D. వి.వి.గిరి
స్వతంత్ర్య అభ్యర్థిగా వివి గిరి రాష్ట్రపతిగా గెలిచారు
9.భారత ఉప రాష్ట్రపతి ఎవరికి బాధ్యత వహిస్తాడు?
జవాబు: B. పార్లమెంట్
భారత ఉప రాష్ట్రపతి పార్లమెంట్‌కు బాధ్యత వహిస్తాడు
10. భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టారు?
జవాబు: D. రాజ్యసభలో మాత్రమే
రాజ్యసభలో మాత్రమే భారత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.