టీఆర్ఎస్ పార్టీ బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో పీజేఆర్ కూతురు విజయారెడ్డి చేరనున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి.. అగ్ని పథ్ పై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా పాల్గొని.. కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
ఆ సందర్బంగా పీజేఆర్ కూతురు విజయారెడ్డి.. మీడియా తో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని.. ఈ నెల 23 వ తేదీన చేరతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో అభివృద్ది సాధ్యమన్నారు. మా నాన్న పీజేఆర్ clp లీడర్ గా పని చేశారని… ఆఖరి వరకు పార్టీ లో ఉన్నాడని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ రాజకీయం దేశానికి అవసరమని చెప్పారు.
మర్యాద పూర్వకంగా కలిశానని.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతున్నానని ప్రకటించారు విజయారెడ్డి.కాగా.. కొంత కాలంగా టిఆర్ఎస్ లో గుర్తింపు లేదన్న అసంతృప్తితో విజయా రెడ్డి ఉన్నారు. విజయ రెడ్డి తో రెండు రోజుల క్రితం ఇద్దరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. టిఆర్ఎస్ లో కొనసాగుతానని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు విజయా రెడ్డి. జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ పదవి ఆశించిన విజయా రెడ్డి..దక్కకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.