వెన్నుపోటు గురించి తెలిసిన వాడికి.. బ్యాగ్ బోన్ కులాల గురించి ఎందుకు ? – విజయసాయి

-

వెన్నుపోటు గురించి తెలిసిన వాడికి.. బ్యాగ్ బోన్ కులాల గురించి ఎందుకు ? అని  టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఫైర్ అయ్యారు విజయసాయి రెడ్డి. బీసీలు జడ్జిలుగా పనికిరారని కొలీజియానికి లేఖ రాశావే చంద్రం! చెప్పులు మోసేవారిని అందలమెక్కించావు తప్ప పేదలను మనుషులుగా చూశావా? జనాభా ప్రాతిపదికన బీసీలకు ప్రాతినిధ్యం కల్పించిన చరిత్ర జగన్ గారిదని కొనియాడారు.

‘వెన్నుపోటు’ మాత్రమే తెలిసినవాడివని… బ్యాక్ బోన్ కులాల గురించి నీకెందుకు బాబూ? అని చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి పాత్రుడు, బొల్లి రవీంద్ర, మలమల రాముడు, బండ సత్తిలకు కళ్లు నెత్తికెక్కితే బీసీల స్థితిగతులు మారినట్టా చంద్రం? వీళ్లను అడ్డం పెట్టుకుని బిసిలను మోసం చేశావు. నీ 14 ఏళ్ల పాలనలో బీసీలను నానా రకాలుగా అవమానించినందుకే వారు గుణపాఠం నేర్పారు. మళ్లీ చిత్తుచిత్తుగా ఓడిస్తారు నిన్ను అంటూ చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news