సినిమా ప్రమోషన్ కోసం సంతోష్ శోభన్ కష్టాలు..!!

-

ఈ సినిమా తీయడం ఒక ఎత్తు అయితే,దానిని ప్రమోషన్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేయడం ఇంకా పెద్ద పనిగా మారింది. ఈ విషయాల్లో పెద్ద హీరోల సినిమాలకే ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.ఇక చిన్న సినిమాల పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. ఈ పరిస్థితి ని గమనించి చిన్న సినిమాల హీరోలు, మేకర్స్ తమ సినిమాను తక్కువ ఖర్చులో డిఫెరెంట్ గా ప్రమోషన్ చేస్తున్నారు.

ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాని కూడా అదే విధంగా ప్రమోషన్ చేస్తున్నారు.హీరో సంతోష్ శోభన్ తో గతంలో రిలీజ్ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ నుంచి ఈ సినిమా మీద హైప్ పెరుగుతూ వచ్చింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాని  రావడం సినిమా పై బజ్ క్రియేట్ చేసింది. అలాగే హీరో సంతోష్ శోభన్ గురించి చెబుతూ  సంతోష్ లో తనను తాను చూసుకుంటానని నాని అనడం తో సినిమా పేరు జనాల్లోకి వెళ్ళింది.

దీన్ని అవకాశం గా తీసుకొని సినిమా ను ఇంకాస్త  జనాల్లోకి ముందుకు తీసుకు వెళుతున్నారు .హీరొ శోబన్ తో పాటు మరికొంత మంది  మా సినిమా మీకు తెలుసా అంటూ ప్రజలను అడగటం జరిగింది. దానికి చాలా మంది ఫన్నీగా తెలియదు అని రియాక్ట్ కావడంతో దానిని విడియో తీసి తమపై తామే సెటైర్స్ వేసుకుంటూ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. అందుకే అంటారు కూటి కోసం కోటి విద్యలు లాగా, ప్రమోషన్ కోసం నానా పాట్లు అని అంటారు. ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news