రాజధాని విషయంలో గందరగోళ ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు టిడిపి పొలిటి బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు. విశాఖను రాజధానిగా ఏ చట్టం ప్రకారం పెడతారని ప్రశ్నించారు. విశాఖలో క్యాంపు కార్యాలయం పెట్టుకునే హక్కు మాత్రమే ఉందని.. విశాఖ రాజధాని అంటుంటే జగన్ కి పిచ్చాసుపత్రి కోసమేనా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఏపీకి సీఎం జగనా..? లేక సజ్జలా..? అని ప్రశ్నించారు. జగన్ తప్పులు బయట పడుతున్నాయని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తన తల్లి ఓటమి కోసం పని చేయడంతో తన బాబాయ్ వివేకా అంటే జగనుకు కోపం అన్నారు. కొడాలి నాని ఇదే విషయాన్ని చెప్పాడని అన్నారు. రక్తపు మడుగులో ఉంటే విజయసాయి రెడ్డి గుండె పోటు అని ఎలా చెప్పాడు..? ప్రశ్నించారు. వివేకా హత్యపై సీబీఐ వాళ్లు ముందు విజయసాయి రెడ్డిని అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు.