కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యానికి బాసర ట్రిపుల్ ఐటీ కేరాఫ్ అడ్రస్‌గా మారింది, ఇక్కడ అడుగడుగునా నిర్లక్ష్యమే తాండవమాడుతోందని విజయశాంతి ఫైర్ అయ్యారు. ఇప్పటికే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతోంటే… తాజాగా ట్రిపుల్ ఐటీలో కరెంట్ లేక ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి క్యాంపస్లో కరెంట్ లేదన్నారు.
విద్యుత్ పునరుద్దరణకు మరో రెండు రోజులు పడుతుందని సిబ్బంది తెలిపారు. రాత్రి క్యాండిల్స్ వెలుతురులోనే విద్యార్థులు భోజనం చేశారు. విద్యుత్ లేకపోవడంతో నీటి సరాఫరా కూడా నిలిచిపోయింది. ఇక క్యాంపస్‌లో ఉన్న భారీ సోలార్ ప్లాంట్ నిరుపయోగంగా పడి ఉంది. గవర్నర్ గారు పర్యటించిన మరుసటి రోజే క్యాంపస్లో కరెంట్ పోయిందని నిప్పులు చెరిగారు.
వసతుల కల్పనలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నరని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నరు. ట్రిపుల్ ఐటీలో ఇదొక్కటేకాదు. ఇంకా అనేక సమస్యలు రాజ్యమేలుతున్నయి. అయినా కేసీఆర్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా ట్రిపుల్ ఐటీలో మౌలిక వసతులు కల్పించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నం. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేసీఆర్ సర్కార్‌కి యావత్ విద్యార్థి లోకం త్వరలోనే తగిన సమాధానం తప్పక చెబుతుందన్నారు విజయశాంతి.