దొర కేసీఆర్‌..ఇయాళ మళ్లీ నిజాం సమాధికి మొక్కు – విజయశాంతి

-

దొర కేసీఆర్‌..ఇయాళ మళ్లీ నిజాం సమాధికి మొక్కు అంటూ బీజేపీ పార్టీ నేత విజయశాంతి చురకలు అంటించారు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ గారూ…. నిజాం రాజు, కాశిం రజ్విలు తెలంగాణ ప్రజల్ని హింసించి, వేధించి దారుణాతి దారుణమైన అకృత్యకాండలకు పాల్పడ్డారా.. లేదా? అని నిలదీశారు. ఆత్మసాక్షిగా ఈ ఒక్క మాట చెప్పగలిగే ధైర్యం మీకు ఉందా? అని ప్రశ్నించారు.

ఇంతకీ సమైక్యతా దినం అనేది మీరు ఏ సమాధికైతే మొక్కారో ఆ నిజాంకు అనుకూల దినమా? నియంత నిజాం – కాశిం రజ్విల వ్యతిరేక దినమా? ప్రజలు కూడా నీ లెక్క ఆ సమాధికి మొక్కాల్నా? అది తప్పు అని నీకు సమాధానం చెప్పాల్నా? అని ఆగ్రహించారు. ఈ సెప్టెంబర్ 17 విమోచన దినం గాక… మీరన్నట్లు సమైక్యతా దినోత్సవమైతే ఇయ్యాల మల్లా నిజాం సమాధికి మరోసారి మొక్కు కేసీఆర్ గారూ… తెలంగాణ ప్రజలు కూడా చూసి తెల్సుకుంటరు.. లేదంటే సర్దార్ పటేల్ గారికి మొక్కు, నియతి ఉంటే అంటూ ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news