విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలపై వ్యూహ రచన

-

సంక్షేమ పథకాలతో దూసుకెళుతున్న వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే తన సత్తా చాటుతోంది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు సాధించి ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే సీఎం జగన్ మోహన్ రెడ్డి.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. రైల్వేశాఖకు ఉపయోగం లేని భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని మంత్రిని కోరారు. అయితే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా సీఎం రాసిన లేఖ ప్రాధాన్యతను సంతరించుకుంది.

CM Jagan Mohan Reddy
CM Jagan Mohan Reddy

విజయవాడ నగరంలోని రాజేశ్వరీ పేటలోని రైల్వే స్థలంలో 800 కుటుంబాలు నివాసముంటున్నాయి. కేంద్ర మంత్రి ఇదే విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. 30 ఏళ్లుగా ఆ కుటుంబాలు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలని గత ప్రభుత్వాలకు వారు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని సీఎం జగన్ వెల్లడించారు. కనీసం ఆ సమస్యను రైల్వే శాఖ దృష్టికి కూడా తీసుకురాలేదన్నారు.

అయితే ఇప్పుడు రాజరాజేశ్వరి పేటలో నిరుపేద కుటుంబాలు నివాసముంటున్న భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని.. దానికి బదులుగా అజీత్ సింగ్ నగర్‌లో 25 ఎకరాలను రైల్వేశాఖకు బదిలీ చేయనున్నట్లు సీఎం జగన్ కేంద్ర మంత్రికి సూచించారు. సంబంధిత రైల్వే బోర్డు అధికారులతో ఈ అంశం చర్చించి తగిన నిర్ణయం త్వరితగతిన తీసుకోవాలని రైల్వే మంత్రిని ముఖ్యమంత్రి కోరారు.

కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి లేఖకు స్పందించినా లేకున్నా.. తమ నాయకుడు తమ కోసం కేంద్రానికి లేఖ రాసి తమకు మేలు చేస్తున్నారనే అభిప్రాయం ఆ 800 కుటుంబాలలో కలుగుతుంది. దీంతో కార్పొరేషన్ ఎన్నికలకు వ్యూహం గట్టిగానే తగిలినట్టైంది. అయితే వేచి చూడాలి కేంద్రం సీఎం జగన్‌మోహన్ రెడ్డి రాసిన లేఖకు ఏవిధంగా స్పందిస్తుందో. కాగా తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెదేపా జిల్లాలుగా పేరున్నా కృష్టా, గుంటూరు జిల్లాలో మెజారిటీ స్థానాలు వైకాపానే కైవసం చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వేకాపానే విజయకేతనం ఎగురవేస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news