ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి పార్టీ మారుతారు : కేటీఆర్

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత పార్టీ మారుతారని.. ఆయనకు అనుకూలంగా ఉండే బీజేపీలోకి వెళ్తారని ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.హనుమకొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ మాట్లాడుతూ… బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలు గోస పడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తామని చెప్పారని… ఇచ్చిన హామీలు అమలు చేయటంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతులకు అండగా నిలిచారని.. కానీ ఓట్ల కోసమే రేవంత్ రైతుబంధు వేస్తున్నారని అన్నారు. విద్యావంతుల పక్షాన కొట్లాడే వారిని పట్టభద్రుల ఎన్నికల్లో గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పరిశ్రమలు తెస్తే…. కాంగ్రెస్ హయాంలో వెనక్కి పోతున్నాయని ,కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లాంటి వారికి ఓటుతో ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news