Vimala Raman : బంధంగా మారబోతున్న ప్రేమ..రీల్ విలన్‌తో హీరోయిన్ విమలా రామన్ మ్యారేజ్!

-

మాలీవుడ్ (మలయాళ) ఫిల్మ్ ఇండస్ట్రీలో మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది విమలా రామన్. మలయాళ భాషతో పాటు ఇతర భాషల్లోనూ నటించేందుకు ముందుకొచ్చిన ఈమె.. తెలుగులోనూ పలు చిత్రాలు చేసింది.

ఈ క్రమంలోనే ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీలో పొజిషన్ ఆక్యుపై చేసింది. కాగా, ఈ భామ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నదనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం సినీ వర్గాల ద్వారానే బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది.

గత కొద్ది రోజులుగా కోలీవుడ్ హీరో, విలన్ అయిన వినయ్ రాయ్ తో ప్రేమలో ఉంది విమలా రామన్. వీరిరువురు కలిసి జంటగా వెకేషన్స్ కు వెళ్తుంటారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంటుంటారు కూడా. ఈ క్రమంలోనే వీరి మధ్య ఉన్న ప్రేమ బంధంగా మారి మరింత బలపడేందుకుగాను పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

మాల్దీవ్స్ కు వెళ్లిన సందర్భంగా వీరిరువురు కలిసి చేసిన ఎంజాయ్ మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో గతంలో బాగా వైరలయ్యాయి. కాగా, త్వరలో వీరు వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందుతోంది.

వినయ్ రాయ్ తమిళ్ సినిమాల్లో హీరో, విలన్ రోల్స్ ప్లే చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల తెలుగులో విడుదలైన కోలీవుడ్ ఫిల్మ్స్ ‘డాక్టర్ ఈటీ (ఎవరికీ తలవంచకు)’ చిత్రాల్లో వినయ్ నెగెటివ్ రోల్స్ ప్లే చేశారు. చూడాలి మరి.. వినయ్ – విమల్ ల వివాహ బంధం గురించి అధికారికమైన సమాచారం ఎప్పుడు వస్తుందో..

Read more RELATED
Recommended to you

Latest news