తెలంగాణకు చీకట్లోకి నెట్టాలని కేంద్రం చూస్తోంది – జగదీష్ రెడ్డి

-

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్‌ దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చింది. విద్యుత్ బకాయిల చెల్లింపు పై తాజాగా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి బకాయిలు ఉన్న నిధులు వెంటనే చెల్లించాలని తెలంగాణకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సర్కార్. అయితే.. దీనిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహించారు. ఇది ముముమ్మాటికీ దేశద్రోహపూరిత చర్యేనని.. తెలంగాణా ప్రభుత్వంపై కేంద్రం కక్ష్య పూరితంగా వ్యవరిస్తోందని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలి అన్నది కేంద్రం కుట్ర అని ఆగ్రహించారు.

ఏ పి నుండి రావాల్సిన 12900 కోట్లబకాయిలు పెండింగ్ లో ఉన్నాయి… కేంద్రానికి మోర పెట్టుకున్నా స్పందించలేదని మండిపడ్డారు. విద్యుత్ తోపాటు,బకాయిలు, పి పి ఏ లలోను ఎపి తెలంగాణా కు నష్టమే చేసిందన్నారు.2014 ఎన్నికల ప్రచారంలో దేశంలో వెలుగులు నింపుతామన్న మాట దక్కేలా లేదని.. గుజరాత్ తో సహా అన్ని రాష్ట్రాలలో విద్యుత్ రంగం సంక్షోభంలో పడిందని మండిపడ్డారు.

దేశ రాజధానితో సహా అన్ని రాష్ట్ర రాజధానిలలో విద్యుత్ కోతలు విధిస్తున్నారని.. ఎటువంటి కోతలు లేనిది ఒక్క తెలంగాణా లోనేనన్నారు. విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాధించిన విజయాలను బిజెపి సర్కార్ జీర్ణించుకోలేక పోతుందని.. ఆందుకే బిజెపి సర్కార్ కు కంటగింపు అని మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కు అడ్డుపుల్ల వేసేందుకే… ఇలాంటి చర్యలకు పూనుకుంటుందని మండిపడ్డారు. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదని.. కృష్ణా ,గోదావరి జలాల విషయంలోనూ కేంద్రం అదే ధోరణి అవలంబిస్తుందని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news