ఇలా విఘ్న నాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు తయారు చేసేయండి..!

-

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ లో వినాయక చవితి. విఘ్నాలు తొలగి పోయి పనికి ఆటంకం ఏమీ రాకూడదని వినాయకుడికి పూజ చేస్తారు. వినాయక చవితి ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలలో ప్రధానమైన పండుగగా గుర్తించబడింది. కర్ణాటక, హైదరాబాద్ ప్రాంతాలలో అయితే అతి వైభవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తారు. అయితే ఏ పని ప్రారంభించినా పూజ లేదా యజ్ఞయాగాదులు తల పెట్టినా ప్రారంభంలో వినాయకుని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. వినాయకుడి దగ్గర ఉండి ఎటువంటి తప్పిదాలు జరగకుండా తలపెట్టిన కార్యాలను ఏ విఘ్నలనీ లేకుండా పూర్తి చేయడంలో సహాయం చేస్తాడని భక్తుల నమ్మకం.

 

Lord Ganesh

వినాయక చవితి నాడు చేయవలసిన ప్రసాదాలు:

వినాయకుడికి ఉండ్రాళ్ళు, కుడుములు ప్రధానంగా నైవేద్యం పెడతారు అయితే వాటిని మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

ఉండ్రాళ్ళు:

ఉండ్రాళ్ళ కి కావలసిన పదార్థాలు:

బియ్యం రవ్వ ఒక కప్పు
నీళ్లు
శనగపప్పు అర కప్పు
జీలకర్ర కొద్దిగా
నూనె కొద్దిగా

ఉండ్రాళ్ళని తయారు చేసుకునే పద్ధతి:

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నూనె వేసి అది కాగిన తర్వాత జీలకర్ర వేయించుకోవాలి. తర్వాత అందులో నీళ్ళు పోసి ఉప్పు వేసి మరిగిన తరువాత శనగపప్పు, బియ్యం రవ్వ వేసి కలపాలి. దీనిని సన్నని మంట మీద ఉడికించుకోవాలి. దించే ముందు కొద్దిగా నెయ్యి వేసి కలపాలి. తర్వాత ఉండలుగా చుట్టుకోవాలి అంతే. ఇలా తయారు చేసి వినాయకుడికి నైవేద్యం పెట్టేయండి.

కుడుములు:

కుడుముల కి కావలసిన పదార్థాలు:

బియ్యం రవ్వ ఒక కప్పు
సెనగపప్పు కొద్దిగా
కొబ్బరి తురుము ఒక కప్పు
ఉప్పు తగినంత

తయారు చేసుకునే పద్ధతి:

ఒక గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసుల నీళ్ళు పోసి.. తగినంత ఉప్పు వేసి శనగపప్పు కూడా వేసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత దానిని దింపేసి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకొని ఇడ్లీ ప్లేట్లలో పెట్టి ఆవిరి మీద ఐదు నిముషాలు ఉడికించుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news