అసలు వినాయక చవితి ఎప్పుడు వెలుగులోకి వచ్చిందో తెలుసా..?

కేవలం మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా వినాయక చవితి అనేక ప్రాంతాల్లో చేసుకుంటారు. ప్రధానంగా వినాయక చవితిని మహారాష్ట్ర, కర్ణాటక, గోవా మరియు మన తెలుగు రాష్ట్రాలలో కూడా వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వినాయకచవితి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది వినాయక నిమజ్జనం. వినాయక నిమజ్జనం అన్ని ప్రాంతాలలో చేసినా భారీగా హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాలలో చేస్తారు. అదే విధంగా వివిధ రకాల పత్రాలతో పూజ చేయడం వినాయకుడికి కుడుములు ఉండ్రాళ్ళు వంటివి నైవేద్యం పెట్టడం వంటివి తరతరాలుగా వస్తున్నాయి.

vinayaka-chavithi

అలాగే విద్యార్థులు తమ పుస్తకాలను తీసుకు వచ్చి వినాయకుడి దగ్గర పెడతారు. పసుపు కుంకుమ తో ఓంకారం వ్రాసి చదువులో ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని చదువు బాగా రావాలని…మంచి విద్యాబుద్ధులు కలగాలని ప్రార్థిస్తారు. అయితే ఏ పని చేసినా మొట్టమొదట తప్పకుండా వినాయకుడి పూజ చేయాలి. వినాయకుడి పూజ చేయడం వల్ల చేసే పని లో ఎటువంటి ఆటంకం, ఇబ్బంది లేకుండా దిగ్విజయంగా పూర్తి అవుతుందని అంటారు.

పూజా లేదా యజ్ఞయాగాదులని తలపెట్టినా మొట్టమొదట వినాయకుడి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది ఇలా ఉంటే వీధుల్లో కూడా వినాయకుడి విగ్రహాలు పెట్టి నవరాత్రులు కూడా దీప ధూప నైవేద్యాలతో వినాయకుడికి పూజ చేస్తారు. అయితే అసలు వినాయక చవితి ఎప్పటి నుంచి చేస్తున్నారు..?, ఎప్పుడూ అసలు వినాయక చవితి వెలుగులోకి వచ్చింది అనే విషయాన్ని చూస్తే..

ఈ వినాయక చవితి పండగ నిజానికి ఎప్పుడో ప్రారంభమైంది. అయితే ఎప్పుడు ప్రారంభమయింది అనేది ఎవరికీ సరైన అవగాహన లేదు. కానీ మహారాష్ట్రలో శివాజీ పాలనలో ఈ వేడుకలు చేసినప్పుడు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే ఈ పండుగని మేధస్సు, విజయం మరియు పవిత్రతకు ప్రధాన మూలాధారమైన వినాయకుని కోసం జరుపుకునేవారు. అలానే అన్ని కళల్లో నైపుణ్యం కలిగిన విఘ్నేశ్వరుడుని పూజించిన భక్తుల పట్ల తనను పూజించిన భక్తుల పట్ల కృపతో, తలపెట్టిన కార్యాలు, కళలనందు విఘ్నాలు లేకుండా పూర్తిచేయడంలో సహాయపడుతాడని తరతరాల నుండి కూడా వినాయక పూజ ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా హిందువులు విఘ్నేశ్వరుడి పూజ చేయడం శుభం కలగాలని కోరుకోవడం జరుగుతున్నదే. ఈ సంవత్సరం కూడా పూజ చేసి.. కధ అక్షింతల వేసుకుని మీరు చేసే పని లో ఎటువంటి ఆటంకం లేకుండా శుభం కలిగి ఆనందంగా వుండండి.