కిమ్ చావు వార్త కంటే .. ఈ న్యూస్ నార్త్ కొరియా వాళ్ళని ఎక్కువగా భయపెడుతోంది..!!

-

కరోనా వైరస్ తర్వాత ప్రపంచమంతా ఎక్కువగా వైరల్ అవుతున్న న్యూస్ ఉత్తరకొరియా అధ్యక్షుడు నియంత కిమ్ జాంగ్ మరణ వార్త గురించి. దాదాపు అన్ని దేశాలు మరియు ఉత్తరకొరియా మీడియా కూడా కిమ్ జాంగ్ మరణించినట్లు నమ్ముతున్నాయి. అధికారికంగా ఈ వార్త ఇంకా బయటకు రాకపోయినా బయట ప్రపంచం మాత్రం కిమ్ జాంగ్ చనిపోయినట్లు అని దృవీకరించారు. ఇటువంటి టైం లో ఉత్తర కొరియా అధ్యక్ష పీఠానికి కిమ్ జాంగ్ చెల్లెలు కిమ్ యో జోంగ్ పగ్గాలు చేపట్టడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త కిమ్ చావు వార్త కంటే ఉత్తరకొరియా ప్రజలను మరీ ఎక్కువగా భయపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో టాక్. మామూలుగా అయితే కిమ్ జాంగ్ నరరూప రాక్షసుడు లాంటి నియంత అని బయట ప్రపంచానికి అందరికీ తెలిసిందే.Kim Jong-un's Sister Will Be Tougher 'God-Like' Tyrant If He Dies ... అతని ముందు ఎవరు నిలవకూడదు, అతని చెప్పిందే శాసనం అన్నట్టుగా ఉత్తర కొరియా ప్రజల నీ అనేక ముప్పుతిప్పలు పెట్టాడు. అలాంటిది ఆయన కంటే మహా డేంజర్ అంట సోదరి కిమ్ యో జోంగ్. కాగా ఇప్పటికే కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ ఉత్తర కొరియాపై పూర్తి పట్టు సాధించారని సమాచారం. అంతేకాకుండా రావటం రావటమే శత్రు దేశాలకు హెచ్చరికలు కూడా పంపిందట. తన అన్న మాదిరిగానే చిన్ననాటి నుండి ఆయన లక్షణాలన్నీ చెల్లెళ్లకు కూడా ఉన్నాయట. మామూలుగా తన అన్న పరిపాలన చేస్తున్న సమయంలో ముందుండి నడిపించే వాడైతే వెనుక నుండి చెల్లెలు సలహాలు ఇచ్చేది అని అక్కడ రాజకీయ నాయకులు అంటున్నారు.

 

ఇదే టైమ్ లో పాలనా వ్యవహారంలో కిమ్ కూడా తన చెల్లెళ్లను మాత్రమే నమ్ముతారట. అన్నయ్య కంటే చెల్లెల్లు చాలా డేంజర్ అని ఉత్తర కొరియా ప్రజలు ప్రస్తుతం భయపడిపోతున్నారు. ఇదే సమయంలో ఈమె హిస్టరీ గురించి తెలుసుకున్న శత్రు దేశాలు కూడా గజగజ లాడుతున్నయి. అప్పట్లోనే అన్నయ్య పరిపాలన చేస్తున్న సమయంలోనే దక్షిణ కొరియాకి అదేవిధంగా అమెరికాకి చెల్లెలు కిమ్ యో జోంగ్ వార్నింగ్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఉత్తర కొరియా ప్రజలంతా కిమ్ యో జోంగ్ అధికారికంగా పాలన చేపడితే మా బతుకులు ఇంక ఏమైపోతాయో అంటూ బిక్కుబిక్కుమంటున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news