Viral Video: కోతిని పరిగెత్తించిన ముళ్లపంది

-

ఇటీవల సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలకు క్రేజ్ విపరీతంగా పెరిగింది. కొన్ని జంతువులు చేసే ఫన్నీ పనులు భలే విచిత్రంగా అనిపిస్తాయి. జంతువులు చేసే ఫన్నీ ఇన్సిడెంట్స్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకోవాల్సిందే. జంతువుల్లో తింగరి చేష్టలు చేసే పనుల్లో కోతులు ముందుంటాయి. తాజాగా ఓ కోతి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు.

కోతి-ముళ్లపంది
కోతి-ముళ్లపంది

ఓ జూలో కోతి చేసిన పనికి అందరూ విపరీతంగా నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో కోతిని, ముళ్ల పందిని మనం చూడవచ్చు. వీడియో ప్రారంభంలో ముళ్లపంది ఒక చెట్టు దగ్గర సేదతీరుతూ ఉంటుంది. ఇంతలో అక్కడే ఉన్న కోతి.. ముళ్ల పందిని కదిలిస్తుంది. దీంతో ముళ్ల పందికి పట్టరాని కోపం వస్తుంది. వెంటనే కోతిని పట్టుకునేందుకు పరిగెత్తుతోంది. కానీ కోతి చెట్టు ఎక్కి సేఫ్ అవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news