Viral Video : అమ్మాయి చేతిలో ఫోన్ లాక్కున్న బైకర్.. ఆ దొంగ ఎవరో చూసి ఆమె మైండ్ బ్లాక్

-

అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఫోన్ లోనే లీనమైన ఆమె పక్కన ఎవరొస్తున్నారు.. ఎదురుగా ఎవరొస్తున్నారు ఏం చూడటం లేదు. తన లోకం తాను మాట్లాడుతూ వెళ్తూ ఉంది. సడెన్ గా ఓ మెరుపు వేగం.. రెప్పపాటులో తన చేతిలోని ఫోన్ మాయం. ఏమైందని చూద్దామనుకునేలోగా తలపై ఓ పిడిగిద్దు. దెబ్బకి ఆ అమ్మాయి కిందపడింది. లేచి తేరుకునేలోగా ఆ యువకుడు అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. కానీ ఈ సంఘటన చూసిన స్థానికులు అతణ్ని వెంబడించి పట్టుకున్నారు. ఆ అమ్మాయి వద్దకు తీసుకొని వచ్చారు. తీరా ఆమె తన మొబైల్ దొంగిలించిన వాడిని చూసి షాక్ అయింది. ఇంతకీ ఆ అమ్మాయి ఫోన్ దొంగిలించింది ఎవరంటే..?

 

చైన్ స్నాచింగ్ చూశాం.. కానీ ఫోన్ స్నాచింగ్ చూడటం ఇదే ఫస్ట్ టైం. రోడ్డుపై నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుతున్న ఓ అమ్మాయి చేతిలో నుంచి అటుగా వెళ్తున్న ఓ బైకర్ ఫోన్ లాక్కొని వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు అతడిని వెంబడించి పట్టుకుని అమ్మాయి వద్దకు తీసుకొచ్చారు. తీరా అతన్ని చూస్తే అతడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. ఫోన్ పోయిందని ఏడుస్తున్న ఆ అమ్మయి అతణ్ని చూసి నువ్వా.. అని అనడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అప్పుడు ఆ యువతి ఫోన్ దొంగిలించిన వ్యక్తిని చూపించి తన ప్రియుడని చెప్పింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భలే భలే కామెంట్లు చేస్తున్నారు. అక్క బాయ్ ఫ్రెండ్ దొంగ అంటూ ఒకరు.. మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చెక్ చేయాలంటే ఇలా ట్రై చేయొచ్చు గురూ అంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికి ఈ వీడియో నెటిజన్లు బాగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే భారీ సంఖ్యలో షేరింగ్స్, లైక్స్ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం. మీరు ఈ వీడియోను చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news