ఏపీ, తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. AAIలో ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసింది. పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 156 ఖాళీలను చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన వారు అప్లై చెయ్యచ్చు.

ఈ పోస్టులకు 12వ తరగతి నుంచి మాస్టర్స్ దాక పూర్తి చేసిన వారు అర్హులే. ఇక పోస్టుల వివరాలను చూస్తే.. జూనియర్ అసిస్టెంట్ 132 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 10 పోస్టులు, సీనియర్ అసిస్టెంట్ 13 పోస్టులు, సీనియర్ అసిస్టెంట్ (అధికారిక భాష) 1 పోస్ట్ ఉంది.

వయస్సు వివరాలను చూస్తే.. ఆగస్టు 25 నాటికి 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. దరఖాస్తు ఫీజ్ చూస్తే.. అన్‌రిజర్వ్‌డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.1,000 చెల్లించాలి. సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన మహిళలు, SC, ST వికలాంగులుకి దరఖాస్తు రుసుము లేదు. దరఖాస్తు ఫారమ్‌లు సెప్టెంబర్ 1న విడుదల అవ్వనున్నాయి.

వివరాలను https://www.aai.aero/sites/default/files/examdashboard_advertisement/AAI-SR_NOTIFICATION__25th_AUGUST_2022__FINAL.pdf లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news