పెంపుడు జంతువులు కానీ ఇతర జంతువులు కానీ మరొక ప్రాణిని చంపి తినేస్తూ ఉంటాయి ఇలాంటివి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. పైగా మృగాలు లాంటివి అయితే మరొక జంతువుని వేటాడుతూ చంపడం కూడా చూస్తూ ఉంటాం. ఒక జంతువు మరొక జంతువు యొక్క ఫీలింగ్స్ ని అర్థం చేసుకోదు. కానీ ఈ శునకం మాత్రం వెరైటీ. మరొక ప్రాణి బాధను అర్థం చేసుకొని వదిలేసింది. ఇంటర్నెట్లో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
మామూలుగా మనం శునకం ముందు చేపని పెడితే వెంటనే అది ఆనందంతో తినేస్తూ ఉంటుంది. శునకాల కి చేపలు అంటే చాలా ఇష్టం కానీ ఈ కుక్క చాలా దయాగుణంతో ఉంది. ఆ కుక్క చేసిన పనిని చూసి చాలా మంది సంబరపడిపోతున్నారు. ఇంటర్నెట్లో వీడియో కూడా షికార్లు కొడుతోంది.
ఈ వీడియోలో ఒక బౌల్లో చేపను పెట్టి కుక్క ముందు ఉంచారు. చూడగానే మనం కుక్క చేపను తెలుస్తుందేమో అనుకుంటాము కానీ ఆ శునకం మాత్రం అలా చేయలేదు. తిరిగి చేపను నీళ్లలో పెట్టేసి తన జీవితాన్ని సేవ్ చేసింది. ఎంతో దయా గుణంతో ఉంది కదా ఈ శునకం. నిజంగా దీన్ని మెచ్చుకోవలసిందే. 14 సెకండ్ల వీడియో ఇది 14 వేలకి పైగా వ్యూస్ వచ్చాయి. మరి మీరూ ఆ వైరల్ అయిన ఆ వీడియోని చూసేయండి.
Empathy is the most essential quality of living beings pic.twitter.com/M9mRGtvIWW
— Gabriele Corno (@Gabriele_Corno) September 2, 2022