వైరల్ వీడియో;పిల్లలను కాపాడుకోవడానికి తల్లి ప్రేమ చూడండి.

-

ఈ భూమి మీద తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచంలో ఎంతటి క్రూర మృగం అయినా సరే తన పిల్లల విషయంలో చాలా ప్రేమగా వ్యవహరిస్తాయి తమ బిడ్డలు ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ముందుకు వస్తు ఉంటాయి. తమ బిడ్డల ప్రాణాలకు ఆపద ఉందని తెలిస్తే ఏ విధంగా కూడా వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కి చెందిన రవీంద్ర మణి త్రిపాఠి సోమవారం ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేసారు. నీటిలోను, భూమిపై నివసించే  ఆటర్లు తన పిల్లను ఊరకుక్కల బారినుండి కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేసాయి. ఒక ఆటర్‌ పిల్లను లాక్కోవడానికి గానూ మూడు కుక్కలు నది ఒడ్డుకి వచ్చాయి. దీనిని గమనించిన ఆటర్‌, పిల్లను కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. దానికి తోడుగా మరో రెండు ఆటర్లు రంగంలోకి దిగి కుక్కలపై పోరాటానికి దిగాయి.

అక్కడి నుంచి ఈ వీడియో మొదలవుతుంది. ఆ ఓటర్ కి సహాయంగా మరో రెండు వస్తాయి. అయితే రెండు కుక్కలు మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా వాటిపై పోరాటం చేస్తూ ఉంటాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. మొత్తానికి తన పిల్లను కాపాడుకుని నీళ్లలోకి వెళ్లిపోయిన ఆటర్లు చేసిన పోరాటానికి సోషల్ మీడియా జనాలు జేజేలు కొట్టారు. అది తల్లి ప్రేమ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news