ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్… నిరవధికంగా వాయిదా వేసిన నేపథ్యంలో… టీమిండియా కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా.. ఇప్పుడు మరో క్రికెటర్ కూడా రిటైర్మెంట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆయన కూడా టెస్ట్ ఫార్మేట్ కు గుడ్ బాయ్ చెప్పబోతున్నాడు. ఇప్పటికే t20 లకు గుడ్ బాయ్ చెప్పిన విరాట్ కోహ్లీ…. టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడు. రోహిత్ శర్మ తరహాలోనే రిటైర్మెంట్ ఇచ్చి.. కేవలం వన్డే మ్యాచులు ఆడెందుకు సిద్ధమవుతున్నాడు. దీనిపై ఇవాళ సాయంత్రం లేదా రేపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది.