IND VS ENG : వన్డేల్లో విరాట్‌ కోహ్లీ చెత్త రికార్డు..

-

వన్డేల్లో విరాట్‌ కోహ్లీ చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ఇంగ్లండ్‌ తో వన్డే సిరీస్‌ లో తొలి వన్డేకు దూరంగా ఉన్న కోహ్లీ… మిగిలిన రెండు వన్డేలు కలిసి.. 33 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలోనే.. కోహ్లీ తన వన్డే కెరీర్‌ లోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసాడు.

తాను వరుసగా ఆడిన చివరి ఐదు వన్డుల్లో కోహ్లీ చేసిన పరుగులు 8, 18, 0, 16, 17 గా ఉన్నాయి. వరుసగా 5 వన్డేల్లోనూ 20 పరుగులు ఒక్కసారి కూడా చేయకపోవడం కోహ్లీకి ఇదే తొలిసారి. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి రికార్డు లేదు. దీంతో ఫ్యాన్స్‌.. కోహ్లీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా..ఇంగ్లండ్ తో చివరి వన్డేలో ఘనవిజయం సాధించింది టీమిండియా . పంత్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. టీమిండియా మరో 47 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. పంత్ కు వన్డేల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. 16 ఫోర్లు, 2 సిక్సులతో 113 బంతుల్లో 125 పరుగులతో అజేయంగా నిలిచాడు పంత్. పంత్ సెంచరీ సాయంతో టీమిండియా 42.1 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసి మ్యాచ్ లో విజయాన్ని, తద్వారా 2-1తో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news