భారత మహిళా జట్టు క్రికెటర్లకు వీసా కష్టాలు

-

కామన్‌వెల్త్ గేమ్స్‌ లో మొట్టమొదటి సారిగా భారత మహిళా జట్టు పోటీ పడనుంది. బెంగళూరు స్టేడియంలో ట్రైనింగ్‌లో ఉన్న భారత మహిళా జట్టు.. ఆదివారం నాడు బర్మింగ్‌హోమ్‌కు వెళ్లనున్నారు. బర్మింగ్‌హోమ్ వెళ్లడానికి భారత మహిళా జట్టు టీమ్‌ యూకే వీసా దరఖాస్తు చేసుకుంది. అయితే ఇప్పటికీ వీసా అందలేదు. వేసవి రద్దీ కారణంగా యూకేకు ప్రయాణీకుల భారీగా వెళ్తున్నారు. ఈ క్రమంలో వీసా దొరకడం కష్టమవుతోంది. అయితే ఇప్పటికీ భారత మహిళా టీమ్‌లో కొందరికీ వీసా వచ్చింది. కానీ ఆరుగురు మహిళా క్రికెటర్లకు వీసా ఇంకా అందలేదు.

భారత మహిళా క్రికెట్ జట్టు
భారత మహిళా క్రికెట్ జట్టు

దీంతో బీసీసీఐ భారత ఒలింపిక్ సంఘంతో సంప్రదింపులు జరిపింది. యూకే వీసా ఇంకా ఆరుగురు ప్లేయర్లకు రావాలని పేర్కొంది. బర్మింగ్ హోమ్‌కు బయల్దేరడానికి ఇంకా 48 గంటలు ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. కాగా, టీమ్ ఇండియా మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో కామన్‌వెల్త్ గేమ్స్ లో బరిలోకి దిగనుంది. జులై 28వ తేదీ నుంచి మ్యాచులు స్టార్ట్ కానున్నాయి. ఈ నెల 29న ఆస్ట్రేలియాలో, జులై 31వ తేదీన పాకిస్తాన్, ఆగస్టు 3వ తేదీన బార్బొడాస్‌తో భారత్ తలబడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news