క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విష్ణు ప్రియ..!!

-

ఇటీవల కాలంలో మొదట సోషల్ మీడియా ద్వారా తమ ఇమేజ్ ను సొంతం చేసుకొని.. ఆ తర్వాత బుల్లితెరపై తమ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలుగా మారుతూ ఉండడం గమనార్హం. ఇక మరి కొంతమంది నేరుగా మోడలింగ్ రంగం నుంచి యాంకర్ గా అడుగుపెట్టి తమ సత్తా చూపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో విష్ణు ప్రియ కూడా ఒకరు. బుల్లితెర యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక యాంకర్ గా అందరికీ పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై స్పెషల్ కార్యక్రమాలలో కూడా హాజరయ్యి తెగ సందడి చేస్తూ ఉంటుంది.

అంతేకాదు గత కొంతకాలం నుంచి బుల్లితెర ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన ఈమె తాజాగా వెండితెరపై దర్శనం ఇస్తోంది . వాంటెడ్ పండుగాడు చిత్రం ద్వారా వచ్చినా..ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు ప్రియ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ అనేది వెండి ధర పైనే కాదు బుల్లితెర రంగంలో కూడా ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.. ఒక్క ఫిలిం ఇండస్ట్రీలోనే కాదు ప్రతి రంగంలో కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులను మహిళలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా వెల్లడించింది.

ఇకపోతే మహిళలు ఏ రంగంలో అయితే పనిచేస్తుంటారో అక్కడ తప్పకుండా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయని అయితే కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉందనడం కరెక్ట్ కాదని కూడా తెలిపింది. అయితే ఇప్పటివరకు తాను ఎటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కోలేదని ఆమె ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించింది. ఇకపోతే ఇటీవల విష్ణు ప్రియ బిగ్ బాస్ హీరో మానస్ తో కలసి స్టెప్ లేసిన జరీ జరీ పంచ కట్టు అనే పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు షూటింగ్ కి సంబంధించిన వీడియో క్లిప్స్ కూడా బయటకు వస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news