కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్- మాజీ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల దంపతులకు పండంటి ఆడబిడ్డకు జన్మించింది. ఈ విషయాన్ని విష్ణు విశాల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. దీంతో సినీ సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2021 ఏప్రిల్ 22న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఇవాళ్టితో నాలుగేళ్ల వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకున్నారు. తమ పెళ్లి రోజే బిడ్డ పుట్టడంతో ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటూ సంబుర పడుతోంది ఈ జంట.
‘‘మాకు మహాలక్ష్మి (అమ్మాయి) పుట్టింది. ఆర్యన్ ఇప్పుడు అన్నయ్య అయ్యాడు. మా నాలుగో పెళ్లి రోజు నాడే పాప పుట్టడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది మాకు దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నాం. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం కావాలి’’ అని విష్ణు విశాల్ ఫొటోలు షేర్ చేస్తూ పోస్టు పెట్టాడు. ఇక విష్ణు విశాల్ ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు గుత్తా జ్వాల కూడా నితిన్ నటించిన గుండెజారి గల్లంతయ్యిందే మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే.