విశ్వక్‌సేన్ ధమ్‌ కీ హిట్టయితే ఇక అంతే …. భారీగా పారితోషికం

-

ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు మంచి బిజినెస్‌ జరుగుతుండటంతో పెద్ద హీరోలు ఇప్పటికే భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారు. మరోవైపు చిన్న హీరోలు కూడా తమ మార్కెట్‌కు‌, సినిమాపై ఉన్న అంచనాలకు అనుగుణంగా పారితోషికం పెంచేస్తున్నారు. టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్‌ యాక్టర్లలో ఒకరు విశ్వక్‌సేన్‌ ఫలక్‌ నుమా దాస్‌ సినిమాతో హీరోగా బ్లాక్ బస్టర్‌ హిట్టు అందుకున్నాడు. ప్రస్తుతం యువ హీరో నాగశౌర్య రెమ్యునరేషన్ నాలుగు కోట్లు దాటిపోయింది. ఇక మాస్‌ కా దాస్‌ విశ్వక్ సేన్‌ వంతు వచ్చేసింది. ఈ కుర్ర హీరో ప్రస్తుతం నాలుగన్నర కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. విశ్వక్‌ సేన్తాజా చిత్రం ధమ్‌ కీ విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ధమ్‌ కీ విశ్వక్‌సేన్‌ హోం ప్రొడక్షన్స్ లో వస్తోంది. విశ్వక్‌సేన్‌ ధమ్‌ కీ తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లో చేయబోతున్న సినిమా మేలో షురూ కానుంది.

Vishwak Sen hikes his remuneration? | 123telugu.com

అయితే దీని తర్వాత విశ్వక్‌సేన్‌ మరే కొత్త సినిమాకు సైన్ చేయలేదు. ఎవరైనా తనతో సినిమా చేయాలని వస్తే మాత్రం రెమ్యునరేషన్‌ విషయంలో విశ్వక్‌సేన్‌ తగ్గేదేలే అంటున్నాడని ఫిలింనగర్‌ సర్కిల్‌లో జోరుగా టాక్‌ నడుస్తోంది. విశ్వక్‌ సేన్‌ సినిమాలకు నైజాంలో మంచి మార్కెట్‌ ఉంది. ఈ హీరో సినిమా సుమారు 3 కోట్ల వరకు గ్యారంటీగా రికవరీ చేస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఒకవేళ నాలుగన్నర కోట్లు డిమాండ్ చేస్తే.. రూ.10 కోట్ల వరకు నిర్మాణ వ్యయం పెరిగే అవకాశాలున్నట్టు ట్రేడ్‌ విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో నిర్మాతలు ఆర్థిక భారాన్ని పరిగణనలోకి తీసుకొని, రెండున్నర నుంచి మూడు కోట్లు ఆఫర్ చేస్తే సేఫ్‌ జోన్‌లో ఉంటామని నమ్ముతున్నట్టు టాక్‌ కూడా ఉంది. మొత్తానికి నిర్మాతల ఆలోచన మాటెలా ఉన్న విశ్వక్‌సేన్‌ మాత్రం తన రెమ్యునరేషన్‌ విషయంలో కాంప్రమైజ్‌ కావొద్దని ఫిక్సయినట్టు చర్చ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news