అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన వివో ఎక్స్‌50, ఎక్స్‌50 ప్రొ స్మార్ట్‌ఫోన్లు..!

మొబైల్స్ త‌యారీదారు వివో భార‌త్‌లో ఎక్స్‌50, ఎక్స్‌50 ప్రొ పేరిట రెండు నూత‌న స్మార్ట్‌ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. వీటిల్లో 6.56 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను ఇది క‌లిగి ఉంది. ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు. ముందు భాగంలో 32 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఎక్స్‌50 ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 730 ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేయ‌గా, ఎక్స్‌50ప్రొలో స్నాప్‌డ్రాగ‌న్ 765జి ప్రాసెస‌ర్‌ను అమ‌ర్చారు. దీని వ‌ల్ల 5జికి స‌పోర్ట్ ల‌భిస్తుంది.

Vivo X50 and X50 Pro smart phones launched

ఎక్స్‌50 ఫోన్‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు 8 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ లెన్స్‌, 13 మెగాపిక్స‌ల్ పోర్ట్రెయిట్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌ల‌ను ఏర్పాటు ఏశారు. ఎక్స్‌50 ప్రొ ఫోన్‌లో వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాతోపాటు 13 మెగాపిక్స‌ల్ పోర్ట్రెయిట్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ లెన్స్‌, 8 మెగాపిక్స‌ల్ టెలిఫొటో లెన్స్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఎక్స్‌50 ప్రొ ఫోన్‌తో 60ఎక్స్ వ‌ర‌కు జూమ్ ల‌భిస్తుంది. ఈ ఫోన్ల‌లో సూప‌ర్ నైట్ మోడ్ 3.0ను అందిస్తున్నారు. అందువ‌ల్ల రాత్రి పూట తీసే ఫొటోలు కూడా క్వాలిటీతో వ‌స్తాయి.

వివో ఎక్స్‌50, ఎక్స్‌50 ప్రొ స్పెసిఫికేష‌న్లు…

* 6.56 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే
* 2376×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌
* ఎక్స్‌50 – ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 730 ప్రాసెస‌ర్‌
* ఎక్స్‌50 ప్రొ – ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 765జి ప్రాసెస‌ర్
* 8జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 10, డ్యుయ‌ల్ సిమ్
* ఎక్స్‌50 – 48, 8, 13, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* ఎక్స్‌50 ప్రొ – 48, 8, 8, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 32 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* యూఎస్‌బీ టైప్ సి ఆడియో, 5జి (ఎక్స్50 ప్రొ ఫోన్‌లో మాత్ర‌మే)
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
* ఎక్స్‌50 – 4200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్
* ఎక్స్‌50 ప్రొ – 4315 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్

వివో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ ఫ్రాస్ట్ బ్లూ, గ్లేజ్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.34,990 గా ఉంది. 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.37,990గా ఉంది. వివో ఎక్స్‌50 ప్రొ స్మార్ట్‌ఫోన్ ఆల్పా గ్రే క‌ల‌ర్ ఆప్ష‌న్‌లోనే విడుద‌లైంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌లో రూ.49,990 ధ‌ర‌కు లభిస్తోంది. ఈ ఫోన్ల‌ను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్ లోనూ విక్ర‌యించ‌నున్నారు. జూలై 24వ తేదీ నుంచి ఈ ఫోన్ల‌ను అమ్ముతారు. ఇందుకు ప్రీ ఆర్డ‌ర్లు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి.

లాంచింగ్ సంద‌ర్భంగా ఈ ఫోన్ల‌పై హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌తో రూ.4వేల వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చు. 65 శాతం వ‌ర‌కు బై బ్యాక్ వాల్యూను ఇస్తారు. ఇత‌ర ఫోన్ల‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.3వేలు అద‌నంగా ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ఇస్తారు. 1 టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. ఈ ఫోన్ల‌ను కొన్న‌వారు వివో నియో ట్రూ వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్‌పై రూ.2వేల డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు.