షుగర్ వ్యాధికి చెక్ పెట్టాలనుకుంటున్నారా…? సులువైన దారి ఇదే…!

-

నేటి కాలం లో చాల మంది షుగర్ వ్యాధి తో సతమతం అవుతున్నారు. షుగర్ వ్యాధి కి చెక్ పెట్టాలంటే ఈ సులువైన మార్గాన్ని అనుసరిస్తే చాలు. వివరాల్లోకి వెళితే… రాత్రి ఆలస్యంగా తిని వెంటనే నిద్ర పోవడం చాల మంది చేసే తప్పు. దీని వల్ల రక్తం లో షుగర్‌ లెవెల్స్‌ పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉందట. అందుకే ప్రతి రోజూ భోజనం చేసిన తర్వాత పదిహేను నిమిషాలు పాటు నడిస్తే రక్తం లోని షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయని కొందరు శాస్త్రవేత్తలు గుర్తించారు.

దీని మూలంగా ప్రతీ రోజు తిన్న తర్వాత సరదాగా అలా నడిస్తే.. బ్లడ్‌ షుగర్‌ స్థాయిలు తగ్గి మధుమేహం ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అని అంటున్నారు. అలానే మామూలు సమయం లో కూడా ఒక అరగంట పాటు కూడా నడవచ్చు. కానీ రాత్రిపూట భోజనం తర్వాత కేవలం 10 నిమిషాలు నడిచిన తర్వాత డయాబెటిస్‌ పెషెంట్ల రక్తంలోని షుగర్‌ లెవెల్స్‌ను బాగా తగ్గడాన్ని పరిశోధకులు గుర్తించారు. కనుక వాకింగ్ మామూలు సమయం లో చేయడం కంటే కూడా తిన్న తరువాత చేస్తే చాల ప్రయోజనం కలుగుతుంది.

పరిశోధన వివరాలని చూస్తే… మామూలు సమయంలో అరగంట సమయం నడిచిన వారి కన్నా భోజనం చేసిన తర్వాత వాకింగ్‌ చేసిన వారిలో బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ 12 శాతం అధికంగా తగ్గిపోయాయి. అలానే రాత్రిపూట భోజనం తర్వాత వాకింగ్‌ చేసిన వారిలో ఏకంగా 22 శాతం వరకు షుగర్‌ లెవెల్స్‌ తగ్గినట్లు రీసెర్చర్స్‌ వివరించారు. కాబట్టి ఇలా చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news