బ్యాంకు లోన్ తీసుకోవాలనుకునే వాళ్ళు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..

-

ఇల్లు కట్టడానికో, బిజినెస్ పెట్టడానికో, చదువుకోవడానికో, లేక ఇతర మరే విషయం కోసమైనా బ్యాంకు లోన్ తీసుకోవడం అలవాటే. మన సిబిల్ స్కోరు బాగుంటే లోన్ ఇవ్వడానికి బ్యాంకులు వెనుకంజ వేయవు. కాకపోతే లోన్ తీసుకునేవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరంగా మీకు అవసరం లేకపోయినా లోన్ తీసుకోవద్దు. దానివల్ల అదనపు భారం మీ మీద పడుతుంది. లోన్ వచ్చేటప్పుడు డబ్బులు వస్తాయి కాబట్టి బానే ఉంటుంది. కానీ కట్టేటపుడే డబ్బులు పోతాయి కాబట్టి ఇబ్బందిగా మారుతుంది.

అందుకే అవసరం లేదనుకుంటే లోన్ తీసుకోవద్దు. మరో విషయం ఎవరి అవసరం కోసమో మీరు లోన్ తీసుకోవద్దు. భవిష్యత్తులో ఏదైనా జరిగితే దానివల్ల వచ్చే నష్టం మీకే ఉంటుందని గుర్తుంచుకోండి.

లోన్ తీసుకునే ముందు మొట్టమొదటగా ఆలోచించాల్సిన విషయం వడ్డీ. ఎక్కువ వడ్డీ వీపుకి భారం అవుతుంది. మార్కెట్లో వడ్డీ రేట్లని చెక్ చేసుకోండి. తక్కువ వడ్డీకే రుణాలిచ్చే బ్యాంకులు కూడా ఉంటాయి.

లోన్ తీసుకునే ముందు అన్ని విషయాలని జాగ్రత్తగా గమనించండి. షరతులు మొదలగు విషయాలు అస్సలు మర్చిపోవద్దు. అవే రేపొద్దున్న మీ పాలిట పెద్ద గుదిబండలా మారవచ్చు.
ఫీజులు, ఛార్జీలు తదితర అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుని ఒక అవగాహనకి రండి.

ఈఎమ్ ఐ ఎంత వస్తుంది. అది మీరు చెల్లించేలా ఉన్నారా లేదా చూసుకోండి. మీ పక్కనున్న వారు లోన్ తీసుకుంటున్నారని చెప్పి మీరు రెడీ అయిపోకండి. మీ సామర్థ్యం ఎంతో గుర్తించండి.

ఇవన్నీ తెలుసుకోకుండా గుడ్డిగా లోన్ తీసుకుని ఇబ్బందుల పాలు కావద్దు. బ్యాంకు నుండి తీసుకున్న ప్రతీ రూపాయి వెనక్కి చెల్లించాల్సిందేనని గుర్తుపెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news