మెగా అభిమానులకు పూనకాలే.. వాల్తేరు వీరయ్య నుంచి ఫస్ట్‌ సింగిల్‌ టైం ఫిక్స్‌

-

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగాస్టార్​ చిరంజీవి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్​ వచ్చింది. ఇది ఫ్యాన్స్​కు పూనకాలు తెచ్చేలా ఉంది. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ నుంచి తొలి పాట విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 23న సాయంత్రం 4.05 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అవుతుందని చిత్రబృందం వెల్లడించింది. బాస్ పార్టీకి అందరూ సిద్ధం కండి అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.

First single from Chiru's Waltair Veerayya to be out on this date |  123telugu.com

‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తుండగా, చిరంజవి సరసన శృతి హాసన్, కాథరిన్ ట్రెసా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్ లో చిరు సరసన ఆడిపాడింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో చిరంజీవి, దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన పలు చిత్రాల్లో పాటలు అదిరిపోయే రేంజిలో హిట్టయ్యాయి. ఈ నేపథ్యంలో, ‘వాల్తేరు వీరయ్య’ పాటలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news