గాడ్ ఫాదర్ సక్సెస్ జోష్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇవాళ థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటించాడు.
వాల్తేరు వీరయ్య ప్రీమియర్స్ చూసిన పబ్లిక్.. ఈ సినిమా ఎలా ఉంది? ముందు నుంచి చెప్పినట్లుగానే పూనకాలు తెప్పించారా అనే విషయాలు చెబుతున్నారు. ఈ టాక్ ప్రకారం చూస్తే సినిమాలో బాస్ ర్యాంపేజ్ కేకలు పెట్టించిందట. ఫస్టాఫ్ ఊహించని రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేసిందని తెలుస్తోంది.
ఈ సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ మేజర్ హైలైట్ అని ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. ట్విస్ట్ తో కూడిన ఈ సీన్స్ సీట్లో కూర్చున్న సగటు ప్రేక్షకుడిలో పూనకాలు తెప్పించాయట. ఇలా ఫస్టాఫ్ అంతా కూడా కేక పుట్టించిందని అంటున్నారు.
కథలో ట్విస్టులన్నీ ఒక్కటిగా సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుండటం.. దానికి తోడు చిరంజీవి, రవితేజ పోటాపోటీ నటన మెగా మాస్ ట్రీట్ ఇచ్చిందనే టాక్ నడుస్తోంది. వెండితెరపై రవితేజ ప్రెజెన్స్, సెంటిమెంట్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయని.. మెగాస్టార్ తో కలిసి పూనకాలు తెప్పించడంలో రవితేజ కూడా భాగమయ్యారనే టాక్ స్ప్రెడ్ అయింది.
మరోవైపు ఈ సినిమాలో చిరంజీవి శ్రుతి హాసన్ మధ్య ఓ సూపర్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట. టాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఈ సీక్వెన్స్ ను కొరియోగ్రఫ్ చేశారట. ఈ సినిమాలో అన్నిటికంటే హైలైట్ ఈ ఫైట్ సీక్వెన్సేనట.